ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం.. ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

by Yella Dhawani Reddy |

ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది.

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం.. ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. బుధవారం ముంబై నుంచి దుబాయ్ బయలుదేరిన విమానం కాసేపటికే అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీంతో విమానంలోని ప్రయాణికులంతా ఏం జరుగుతుందో తెలియక ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం. ముంబై నుంచి మంగళవారం రాత్రి 8 గంటలకు వెళ్లాల్సిన విమానం.. ఆలస్యంగా బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరింది. 50 నిమిషాల ప్రయాణం తర్వాత తిరిగి ముంబైలో ఎయిర్‌పోర్టులోనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. ఈ విమానంలో దుబాయ్‌ వెళ్లాల్సిన తెలుగు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. అధికారులు వెంటనే స్పందించాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story