- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆగ్రాలో దారుణం.. భర్తను చంపి జైలుకు.. విడుదలయ్యాక మామను హత్య చేసిన కోడలు..
భర్తల హత్యలు కొనసాగుతున్నాయి. భార్యల కర్వశత్వానికి సంబంధించిన న్యూస్‌లు పెరిగిపోతున్నాయి. యూపీ ఆగ్రాకు చెందిన ఈ కేసు కూడా ఆల్మోస్ట్ అలాంటిదే. బబ్లీ అనే స్త్రీకి హరి ఓమ్‌తో పెళ్లి జరిగింది

దిశ, వెబ్ డెస్క్ : భర్తల హత్యలు కొనసాగుతున్నాయి. భార్యల కర్వశత్వానికి సంబంధించిన న్యూస్‌లు పెరిగిపోతున్నాయి. యూపీ ఆగ్రాకు చెందిన ఈ కేసు కూడా ఆల్మోస్ట్ అలాంటిదే. బబ్లీ అనే స్త్రీకి హరి ఓమ్‌తో పెళ్లి జరిగింది. కానీ ఆమె భర్తను మోసం చేస్తూ ప్రియుడు ప్రేమ్ సింగ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితో కలిసి భర్తను మర్డర్ చేసింది. ఈ కేసులో ఐదున్నర ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఆమె.. ఈ మధ్యే బెయిల్‌పై విడుదలైంది. ఈ క్రమంలో ఈ కేసులో కాంప్రమైజ్ అయ్యేందుకు హరి ఓమ్ తండ్రి రాజావీర్ సింగ్‌ను మాట్లాడేందుకు పిలిచింది. కానీ చర్చలను పక్కన పెట్టి మామను మర్డర్ చేసింది. అంతేకాదు హరిఓమ్ హత్య తర్వాత.. ఆయన ఎనిమిదేళ్ల కొడుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఫ్యామిలీ మొత్తం అతలాకుతలమైంది. పచ్చగా ఉండాల్సిన కుటుంబం ఎటు కాకుండా అయిపోయింది. ఈ కారణంగానే తన కొడుకు, మనవడిని పొట్టనబెట్టుకున్న కోడలిపై న్యాయంపోరాటం చేస్తున్నాడు మామ. కానీ కాంప్రమైజ్ పేరుతో ఈ ప్రాణాలు తీసింది.






