- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Afzalgunj Firing: అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన విషయాలు వెలుగులోకి
అఫ్జల్‌గంజ్ (Afzalganj) కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: అఫ్జల్‌గంజ్ (Afzalgunj) కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసుల గాలింపు విస్తృతంగా కొనసాగుతోంది. కాల్పులు జరిపింది బిహార్ రాష్ట్రానికి చెందిన మనీష్ (Manish)గా ఇప్పటికే గుర్తించారు. అదే రాష్ట్రానికి చెందిన మరో నిందితుడితో కలిసి మనీష్ సొంత రాష్ట్రం బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో దోపిడీలకు తెగబడుతున్నట్లుగా హైదరాబాద్ పోలీసులు నిర్ధారించారు.
ఈ క్రమంలోనే నగరంలోని సీసీ టీవీ ఫుటేజీ (CC TV Footage) ఆధారంగా నిందితులను పోలీసులు కనిపెట్టారు. అఫ్జల్‌గంజ్ (Afzalgunj)లో కాల్పులు జరిపిన దొంగలు నేరుగా ఆటోలో సికింద్రాబాద్ (Secunderabad)కు వెళ్లినట్లుగా గుర్తించారు. రైల్వే స్టేషన్ (Railway Station) సమీపంలో బట్టలు, బ్యాగులు కొనుగోలు చేశారు. అనంతరం తిరుమలగిరి (Tirumalagiri) ప్రాంతంలో బట్టలు మార్చుకుని బ్యాగ్‌లను ఛేంజ్ చేశారు. మదీనా (Madina)లో కొనుగోలు చేసిన ట్రాలీ బ్యాగ్స్ (Trally Bags)ను అక్కడే వదిలేసి పరారయ్యారు. తిరుమలగిరి (Tirumalagiri)లో ఖాళీ ట్రాలీ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, సుచిత్ర (Suchithra) వైపు నిందితులు పరారైనట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ (Bidar)లో పట్టపగలే ఏటీఎంలో డబ్బు లోడ్ చేసేందుక వచ్చని ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిపై మనీష్ గ్యాంగ్ (Amit Gang) కాల్పులకు తెగబడింది. ఈ దాడిలో ఇద్దరు సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం దొంగలు క్యాష్ బాక్స్‌తో బైక్‌పై హైదరాబాద్ (Hyderabad) చేరుకున్నారు. అఫ్జల్‌గంజ్ (Afzalgunj) నుంచి ప్రవేటు ట్రావెల్స్ బస్సులో రాయ్‌పూర్ (Raipur)నకు పారిపోయిందుకు యత్నించారు. కానీ, ట్రావెల్స్ సిబ్బంది వారి బ్యాగులను చెక్ చేయగా పెద్ద మొత్తంలో క్యాష్‌ని చూసి మీరెవరని ప్రశ్నించడంతో వారిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి ఉడాయించారు. ప్రస్తుతం ఆ ఇద్దరు నిందితులు కోసం పోలీసులు నగరం అంతా జల్లెడపడుతున్నారు.






