కారుతో దాడి.. న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ మృతి

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-23 07:20:39  IST  )

హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ దగ్గర కారు దాడికి గురైన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ మృతి చెందారు. నిందితులు కారుతో ఢీ కొట్టి ప‌రారైన అనంత‌రం కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చేర్పించారు.

కారుతో దాడి.. న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ మృతి
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ దగ్గర కారు దాడికి గురైన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ మృతి చెందారు. నిందితులు కారుతో ఢీ కొట్టి ప‌రారైన అనంత‌రం కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చేర్పించారు. కాగా తీవ్ర‌గాయాల‌పాలైన మొయినుద్దీన్ చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న‌పై హిట్ అండ్ ర‌న్ కేసు న‌మోదు చేయ‌గా త‌ర‌వాత హ‌త్య కేసుగా మార్చారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నాంపల్లి పోలీసులు కారు నంబర్ ట్రేస్ చేస్తున్నారు. భూ వివాదాల కార‌ణంగానే నిందితులు మొయినుద్దీన్ ను హ‌త్య చేసిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు మొయినుద్దీన్ వ‌క్ఫ్ బోర్డు భూముల ర‌క్ష‌ణ కోసం సైతం పోరాడుతున్నట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం న్యాయ‌వాదిపై జ‌రిగిన దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు కాపు కాచి న్యాయవాదిని కారుతో ఢీ కొట్టినట్టు సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే అర్థం అవుతోంది. దీంతో న్యాయవాదులు తమ రక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచూ న్యాయవాదులపై ఇలాంటి దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story