HYD: వట్టినాగులపల్లి ఇందిరమ్మ కాలనీలో అడ్డా.. పక్కా ప్లాన్‌తో ఎటాక్ చేసిన పోలీసులు

by Gantepaka Srikanth |

కల్తీకి కాదేది అనర్హం అన్నట్టు ప్రస్తుత పరిస్థితులు తయారు అయ్యాయి. బయట కొనే వస్తువుల్లో మంచిదేదో.. నకిలీదేదో తెలియని, తెలుసుకోలేని దుస్థితి నెలకొంది.

HYD: వట్టినాగులపల్లి ఇందిరమ్మ కాలనీలో అడ్డా.. పక్కా ప్లాన్‌తో ఎటాక్ చేసిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: కల్తీకి కాదేది అనర్హం అన్నట్టు ప్రస్తుత పరిస్థితులు తయారు అయ్యాయి. బయట కొనే వస్తువుల్లో మంచిదేదో.. నకిలీదేదో తెలియని, తెలుసుకోలేని దుస్థితి నెలకొంది. పండగ వచ్చినా, పబ్బం వచ్చినా.. కనీసం రోజువారీ భోజనం చేయాలన్నా ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. చిక్కదనం కోసం పాలలో యూరియా, డిటర్జెంట్, నాసిరకం పాలపౌడర్ కలుపుతున్నారు. నెయ్యిలో వనస్పతి, జంతువుల కొవ్వును కలిపి స్వచ్ఛమైనదిగా నమ్మిస్తున్నారు.

ఇక ఆయిల్ గురించి చెప్పాల్సిన పనే లేదు. అది ఇంజిన్ ఆయిల్‌గా మారినా వదలడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగుజూసింది. గచ్చిబౌలి వట్టినాగులపల్లిలోని ఇందిరమ్మ కాలనీలో కల్తీ ముఠా గుట్టు రట్టయింది. కల్తీ నూనే, గోధుమపిండి దందాను పోలీసులు అడ్డుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఎస్‌ఓటీ పోలీసులు చేసిన సోదాల్లో కల్తీ గుట్టురట్టయింది. కాలం చెల్లిన నూనే సేకరించి రీప్యాకింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో పాటు గడువు ముగిసిన గోధుమపిండిని నకిలీ తేదీలతో విక్రయాలు జరుపుతున్నట్లు నిర్ధారించారు. కల్తీ నూనే, గోధుమపిండిని సీజ్ చేశారు. రాజస్థాన్‌కు చెందిన ముఠాను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story