తెలంగాణ CID ఆఫీస్‌కు నటుడు రానా

by Gantepaka Srikanth |

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌(Betting Apps Case)లకు సంబంధించిన కేసులో టాలీవుడ్ యువ నటుడు దగ్గుబాటి రానా(Rana) నేడు సీఐడీ విచారణకు హాజరు కానున్నారు.

తెలంగాణ CID ఆఫీస్‌కు నటుడు రానా
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌(Betting Apps Case)లకు సంబంధించిన కేసులో టాలీవుడ్ యువ నటుడు దగ్గుబాటి రానా(Rana) నేడు సీఐడీ విచారణకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సీఐడీ విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించి స్టేట్‌మెంట్‌ తీసుకున్న సీఐడీ.. ఇవాళ రానా స్టేట్మెంట్ రికార్డు చేయబోతోంది. కాగా, ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్‌కు చెందిన మొత్తం 29 మంది సినీ సెలబ్రిటీలపై ఈడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరోలైన విజయ్ దేవరకొండ పాటు రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖిలపై కేసు నమోదు చేయగా ప్రకాష్ రాజ్ రెండు రోజుల క్రితం ఈడీ ఎదుట హాజరయ్యాడు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు విచారణ చేస్తుంది.

Next Story