రాజధాని నగరంలో దారుణం.. డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి

by Malleboina Mahesh |

కాలేజీకి వెళ్తున్న డిగ్రీ విద్యార్థినిపై ముగ్గురు యువకులు యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు. ఈ దారుణమైన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో నార్త్‌ ఢిల్లీలోని లక్ష్మీబాయి కాలేజీ సమీపంలో చోటుచేసుకుంది.

రాజధాని నగరంలో దారుణం.. డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి
X

దిశ, వెబ్ డెస్క్: కాలేజీకి వెళ్తున్న డిగ్రీ విద్యార్థినిపై ముగ్గురు యువకులు యాసిడ్‌ దాడి (Acid attack)కి పాల్పడ్డారు. ఈ దారుణమైన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో నార్త్‌ ఢిల్లీలోని లక్ష్మీబాయి కాలేజీ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు యువతిపై యాసిడ్‌ పోసి అక్కడినుంచి పరారయ్యారు. దాడిలో విద్యార్థిని రెండు చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. యాసిడ్ దాడి సమయంలో యువతి తన ముఖానికి రెండు చేతులు అడ్డం పెట్టుకోవడంతో.. అదృష్టవశాత్తూ ఆమె ముఖానికి ఎటువంటి గాయాలు కాలేదు.

ఈ దాడికి పాల్పడిన వారిలో ఒకరు బాధితురాలిని కొంతకాలంగా వెంబడిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను ‘స్టాకర్’గా వ్యవహరిస్తున్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దాడికి పాల్పడిన ముగ్గురిని గుర్తించి పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణ సంఘటనపై ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాలు, మహిళా సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.విద్యార్థినిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు చేస్తున్నారు. ఈ ఘటనతో ఢిల్లీ మహిళా భద్రతపై మరోసారి ప్రశ్నార్థక చిహ్నం నెలకొంది.

Next Story