- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రావెల్ బ్యాగ్ మర్డర్ కేసును ఛేదించిన బాచుపల్లి పోలీసులు
హైదరాబాద్‌లోని నిజాంపేట పరిధిలోని బాచుపల్లి ప్రాంతంలో బుధవారం ట్రావెల్ బ్యాగులో మహిళ మృతదేహం లభ్యం అయిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని నిజాంపేట పరిధిలోని బాచుపల్లి ప్రాంతంలో బుధవారం ట్రావెల్ బ్యాగులో మహిళ మృతదేహం లభ్యం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన స్థానికంగా భయాందోళన కలిగించింది. రెడ్డీస్ ల్యాబ్ ప్రహరీ గోడను ఆనుకుని ఉన్న ఖాళీ ప్రదేశంలో ఈ ట్రావెల్ బ్యాగును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ట్రావెల్ బ్యాగులో ఉన్న డెడ్ బాడీ మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్‌తో ఉన్నట్టు తెలిపారు. 25 నుండి 30 ఏళ్ల యువతి మృతదేహంగా అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. డెడ్ బాడీ నేపాల్‌కు చెందిన యువతిగా గుర్తించారు. నిందితుడు కూడా నేపాల్‌కు చెందిన విజయ్‌గా పోలీసులు గుర్తించారు. కేవలం ఒక్కరోజులోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.






