- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదవశాత్తు మోటార్ సైకిల్ అదుపుతప్పి యువకుడు మృతి
by Ratna Kumari |
దిశ, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మండలం కనుకుల, రేగడి మద్దికుంట గ్రామాలకు వెళ్ళు చౌరస్తా, కూడలి వద్ద మోటార్ సైకిల్ అదుపుతప్పి యువకుడు మృతి చెందాడు. బంధువులు

X
దిశ, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మండలం కనుకుల, రేగడి మద్దికుంట గ్రామాలకు వెళ్ళు చౌరస్తా, కూడలి వద్ద మోటార్ సైకిల్ అదుపుతప్పి యువకుడు మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..వేల్పుల రాజేశం కుమారుడు రఘురాం (18) ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన యువకుడు. సుల్తానాబాద్ నుంచి తన మోటార్ సైకిల్ స్టార్ సిటీ టీఎస్ 02 ఈఎన్ 1670 నెంబర్ గల మోటార్ సైకిల్ పై మడక గ్రామానికి అతివేగంగా వెళ్తున్న క్రమంలో కనుకుల క్రాసింగ్ వద్ద తన మోటార్ సైకిల్ అదుపుతప్పి కింద పడింది. ముక్కుకు, తలకు బలమైన గాయాలు కావడంతో, అక్కడ ఉన్న ఆటోలో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగానే చనిపోయాడని బంధువులు తెలిపారు. సుల్తానాబాద్ పోలీసు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చరిలో భద్రపరిచారు.
Next Story






