- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఏడుగురు మృతి
బొలేరోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే ప్రాణాలో కోల్పోయారు.

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండల పరిధిలోని చిలకలడోన గ్రామ సమీపంలో జరిగిన భీకర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. కూలీలతో ప్రయాణిస్తున్న బొలెరో వాహనాన్ని వేగంగా వచ్చిన ఒక లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు, మృతులంతా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. బొలెరో వాహనంలో ప్రయాణిస్తుండగా చిలకలడోన వద్ద ఎదురుగా వస్తున్న లారీ అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. వారిలో ఏడుగురు మహిళలు, ఒక చిన్నారి, డ్రైవర్ ఉన్నట్లు గుర్తించారు.
పోలీసుల సహాయక చర్యలు..
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనంలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మరో 10 మంది తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.






