Accident: ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు దుర్మరణం, 40 మందికి తీవ్ర గాయాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-12 02:28:39  IST  )

రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన అన్నమయ్య జిల్లా (Annamayya District) పరిధిలోని కర్ణాటక (Karnataka) సరిహద్దులో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Accident: ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు దుర్మరణం, 40 మందికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన అన్నమయ్య జిల్లా (Annamayya District) పరిధిలోని కర్ణాటక (Karnataka) సరిహద్దులో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మదనపల్లి (Madanapally) సమీపంలోని రాయల్పాడు (Rayalpadu) సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సులు బలంగా ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోలార్ (Kolar), శ్రీనివాసపురం (Srinivasapuram), మదనపల్లి (Madanapally)లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More..

Ap: పలమనేరులో ఉద్రిక్తత

Next Story
null