- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి పంజా విసిరిన ACB.. పొందుర్తి RTA చెక్‌పోస్ట్‌పై ఆకస్మిక దాడులు
రాష్ట్రంలో అవినీతి పాల్పడుతోన్న అధికారుల గుండెల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) రైళ్లను పరిగెత్తిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్/భిక్కనూరు: రాష్ట్రంలో అవినీతి పాల్పడుతోన్న అధికారుల గుండెల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) రైళ్లను పరిగెత్తిస్తోంది. లంచం అడగాలంటే భయపడేలా వరుస దాడులు చేస్తూ.. అక్రమార్కులను డైరెక్ట్‌గా జైలుకే పంపుతున్నారు. ఇప్పటి వరకు ఆర్టీఏ కార్యాలయాల్లో దళారులు, అధికారులపై దాడులు జరిపిన ఏసీబీ.. తాజాగా రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) చెక్‌పోస్టులు, కార్యాలయాలపై ఫుల్ ఫకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులోని కామారెడ్డి జిల్లా జుక్కల్, భిక్కనూరు సరిహద్దు మండలాల పరిధిలోని పొందుర్తి (Pondurthi), జంగంపేట ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు చేశారు. అయితే, కొన్నాళ్లుగా చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలు, పన్నుల సేకరణలో అక్కడి అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కలిసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా ఏసీబీకి పక్కా సమాచారం అందింది. దీంతో అదును చూసి ఇవాళ అధికారులు పొందుర్తి చెక్‌పోస్టు వద్ద విస్తృతంగా సోదాలు చేపడుతున్నారు. ఆఫీసు రికార్డులతో పాటు.. రశీదు బుక్కులను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా అక్రమ వసూళ్లలో అధికారులకు సహకరిస్తున్న కొందరు ప్రైవేటు వ్యక్తులను కూడా అదుపులోకి తీసున్నట్లుగా తెలుస్తోంది. సోదాలపై మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.






