- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ADE అంబేడ్కర్ ఇంట్లో కొనసాగుతోన్న ACB సోదాలు.. బినామీ ఇంట్లోనే బస్తాల కొద్ది నోట్ల కట్టలు
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ (ADE Ambedkar) ఇంట్లో ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాలు కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ (ADE Ambedkar) ఇంట్లో ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాలు కొనసాగుతున్నాయి. ఏడీఈ బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో అధికారులు మొత్తం 15 బృందాలుగా విడిపోయి గచ్చిబౌలి (Gachibowli), మాదాపూర్ (Madhapur), హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల సోదాలు చేపడతున్నారు. ఈ క్రమంలో తనిఖీల్లో భాగంగా భారీ ఆస్తులు బయటపడుతున్నాయి. గచ్చిబౌలిలో ఖరీదైన భవనం గుర్తించినట్లుగా ఏసీడీ డీఎస్పీ ఆనంద్ (DSP Anand) వెల్లడించారు. అంబేడ్కర్ బినామీ సతీష్ ఇంట్లో రూ.2 కోట్ల నగదు గుర్తించామని అన్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో 10 ఎకరాలు వ్యవసాయ భూమిని అంబేద్కర్ కొనుగోలు చేశారని పేర్కొన్నారు. అక్కడే మరో వెయ్యి గజాల్లో వ్యవసాయ ఫామ్‌హౌస్ కూడా ఉన్నట్లుగా గుర్తించామని అన్నారు. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేడ్కర్ ఆస్తులపై సోదాలు ముగిశాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు.






