పంజా విసిరిన ACB అధికారులు.. విద్యుత్‌ శాఖ ఏడీఈ ఇంట్లో సోదాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-16 03:17:38  IST  )

రాష్ట్రంలో ఏసీబీ (ACB) అధికారులు లంచాలకు మరిగిన అవినీతి ప్రభుత్వ అధికారుల భరతం పడుతున్నారు.

పంజా విసిరిన ACB అధికారులు.. విద్యుత్‌ శాఖ ఏడీఈ ఇంట్లో సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్/గండిపేట: రాష్ట్రంలో ఏసీబీ (ACB) అధికారులు లంచాలకు మరిగిన అవినీతి ప్రభుత్వ అధికారుల భరతం పడుతున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుటాహుటిన యాక్షన్ ప్లాన్‌తో పక్కగా ట్రాప్ చేసి అక్రమార్కును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటూ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఓవైపు అవినీతి ఆధికారులు లంచం తీసుకుంటూ వరుసగా పట్టుబడుతున్నా.. కొందరి బుద్ధి మారడం లేదు. ధనదాహంతో తమ వద్దకు వచ్చిన వారిని పీడిస్తూ.. పైసా వసూల్ కార్యక్రమాలకు తెగబడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ (ADE Ambedkar) ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఏడీఈ బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో అధికారులు మొత్తం 15 బృందాలుగా విడిపోయి గచ్చిబౌలి (Gachibowli), మాదాపూర్ (Madhapur) సహా పలుచోట్ల సోదాలు చేపడతున్నారు. అయితే, ఏడీఈ అంబేద్కర్‌ భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఏసీబీకి సమాచారం అందడంతో ప్రస్తుతం కొనసాగుతోన్న తనిఖీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Next Story