HYD: ఏసీబీకి చిక్కిన మాదాపూర్ ఎస్ఐ

by Gantepaka Srikanth |

మరో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు పట్టేసుకున్నారు.

HYD: ఏసీబీకి చిక్కిన మాదాపూర్ ఎస్ఐ
X

దిశ, వెబ్‌డెస్క్: మరో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ(ACB) అధికారులు పట్టేసుకున్నారు. మంగళవారం రూ.50 వేలు లంచం తీసుకుంటూ మాదాపూర్ ఎస్ఐ వినయ్(Madhapur SI Vinay) ఏసీబీ అధికారులు చిక్కాడు. ఓ కేసు విషయంలో సహకారం అందిస్తానని ఎస్‌ఐ వినయ్‌ ఫిర్యాదుదారుడిని రూ.50 వేలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ఎస్‌ఐ వినయ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదు సీజ్ చేశారు. వినయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ వసూళ్లకు సంబంధించి ఉన్నతాధికారుల లింక్‌ కూడా ఉన్నట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story