- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆన్లైన్ గేమింగ్ తో అప్పుల పాలై యువకుడు ఆత్మహత్య
దిశ, కామారెడ్డి : ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడిన ఓ యువకుడు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది.

దిశ, కామారెడ్డి : ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడిన ఓ యువకుడు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. పట్టణ సిఐ నరహరి తో పాటు కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని ఓంశాంతి కాలనీకి చెందిన వల్లందేసి గోదావరికి శ్రీనాథ్, శ్రీకర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనాథ్‌కు వివాహం అయింది. శ్రీకర్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే శ్రీకర్ ఏడాదిన్నర కాలంగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో విపరీతంగా అప్పులు చేశాడు. అయితే అప్పులు ఇచ్చిన వారి నుండి ఒత్తిడి ఎక్కువ కావడంతో భరించలేక ఉన్న ఇల్లు అమ్ముకుని కొన్ని అప్పులు తీర్చాడు. మిగతావి ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కాగా గురువారం తల్లి గోదావరి కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఒక్కడే ఉన్న శ్రీకర్ బెడ్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.






