- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుండెపోటుతో ఐడియల్ కంపెనీ కార్మికుడు మృతి
దిశ, చిట్యాల : గుండెపోటుతో ఐడియల్ కంపెనీలో పని చేసే కార్మికుడు మృతి చెందిన సంఘటన చిట్యాల మండలంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై రవికుమార్ తెలిపిన

దిశ, చిట్యాల : గుండెపోటుతో ఐడియల్ కంపెనీలో పని చేసే కార్మికుడు మృతి చెందిన సంఘటన చిట్యాల మండలంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం లోని జాజ్పూర్ జిల్లా జలాల్పూర్ మండలం, నరకందాపూర్ గ్రామానికి చెందిన మనోజ్ జెన (42) చిట్యాల పట్టణ కేంద్రంలోని ఐడియల్ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈనెల 3న తాను పని చేసే కంపెనీ రూమ్ లో నిద్రిస్తుండగా రాత్రి ఒంటిగంట తర్వాత అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తనతో పాటు రూమ్ లో ఉన్న నరేష్ జెన, లేబర్ కాంట్రాక్టర్ రాజేష్ జన లు వెంటనే చికిత్స నిమిత్తం నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించగా తెల్లవారుజామున రెండున్నర గంటలకు వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారణ చేశారు. ఈ మేరకు మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రవికుమార్ తెలిపారు.






