- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, నిడమనూరు : రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై ఉప్పు సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ముకుందాపురం గ్రామానికి చెందిన కలికెనబోయిన లక్ష్మమ్మ (68 ) గురువారం కూలీ పని నిమిత్తం NH-167 జాతీయ రహదారి పై ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద నడుచుకుంటూ వెళ్లోంది. అదే సమయంలో మిర్యాలగూడ వైపు నుంచి హాలియా వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం డ్రైవర్ అతివేగంగా, అజాగ్రతగా, నడుపుతూ కలికెనబోయిన లక్ష్మమ్మ ను డీకొట్టాడు. దీంతో లక్ష్మమ్మ తల కి బలమైన గాయం కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రబుత్వ ఆసుపత్రి లో చేర్పించగా.. పరిస్థితి విషమించటంతో అంబులెన్స్ లో నల్గొండ కి తరలిస్తుండగా మృతి చెందింది. మృతురాలి కొడుకు సైదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు టాటా ఏస్ డ్రైవరు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ ఐ ఉప్పు సురేష్ తెలిపారు.






