ఒకే గ్రామానికి చెందిన మహిళ, పురుషుడు అనుమానస్పద మృతి

by Muthe.Rajitha |

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజ సింగవరం గ్రామంలో బుధవారం రెండు అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నాయి.

ఒకే గ్రామానికి చెందిన మహిళ, పురుషుడు అనుమానస్పద మృతి
X

దిశ,గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజ సింగవరం గ్రామంలో బుధవారం రెండు అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నాయి. ఒకే గ్రామానికి చెందిన ఓ మహిళ, ఓ పురుషుడు ఒకే రోజు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. వారి ఇద్దరి మృతదేహాలు ఒకే ఇంట్లో పడి ఉండటం పలు అనుమానాలు రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఉల్లి శ్రీకాంత్(35) తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, వారి ఇంటికి కొద్ది దూరంలో ఉన్న చెరుకూరి రేఖ(29) కూడా అదే ఇంట్లో మృతి చెందింది. శ్రీకాంత్ భార్య తన తల్లి గారి ఇంటికి వెళ్లగా, రేఖ భర్త బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ లో ఉన్నాడు.

రేఖకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీకాంత్ కు మాత్రం పిల్లలు ఇంకా కాలేరు. సంఘటన తెలిసిన వెంటనే ఎల్లారెడ్డిపేట సిఐ శ్రీనివాస్ గౌడ్ స్థానిక ఎస్సై ప్రేమానందం సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టు మార్టం కోసం జిల్లాలోని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story