వ‌డియాల పిండిలో ప‌డి మూడేళ్ల బాలిక మృతి

by Ratna Kumari |

ఇంట్లో ఆట‌లు ఆడుకుంటూ ప్ర‌మాద‌వ‌శాత్తు వ‌డియాల కోసం ఉడ‌క‌పెట్టిన బియ్యం పిండి వేడి పాత్ర‌లో ప‌డి మూడేళ్ల బాలిక మృతి చెందింది.

వ‌డియాల పిండిలో ప‌డి మూడేళ్ల బాలిక మృతి
X

దిశ‌, మ‌క్త‌ల్ : ఇంట్లో ఆట‌లు ఆడుకుంటూ ప్ర‌మాద‌వ‌శాత్తు వ‌డియాల కోసం ఉడ‌క‌పెట్టిన బియ్యం పిండి వేడి పాత్ర‌లో ప‌డి మూడేళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘ‌ట‌న కృష్ణ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని గుడేబ‌ల్లూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌ట్టు తిమ్మ‌ప్ప జాత‌ర‌కు వ‌చ్చే బంధువుల కోసం వ‌డియాలు వేయ‌డానికి ఉడ‌క‌పెట్టిన పిండి పాత్ర‌ను చ‌ల్లార్చేందుకు కిందికి దింపి త‌ల్లి మిష‌న్ భ‌గీర‌థ వాట‌ర్ ప‌ట్టేందుకు వెళ్లింది. ఆడుకుంటూ కూతురు నందిని(3) వేడిగా ఉన్న పిండి పాత్ర‌లో ప‌డింది. ఒళ్లంతా తీవ్రగాయాల‌య్యాయి. వెంట‌నే చికిత్స కోసం రాయ‌చూర్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్టు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌తో గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

Next Story