ఆ ఇద్దరు బీజేపీ ఎంపీలకు ఝలక్.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-09 02:50:05  IST  )

బీజేపీ (BJP) ఎంపీలపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన జార్ఖండ్‌ (Jharkhand)లో చోటుచేసుకుంది.

ఆ ఇద్దరు బీజేపీ ఎంపీలకు ఝలక్.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ (BJP) ఎంపీలపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన జార్ఖండ్‌ (Jharkhand)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 2న బీజేపీ ఎంపీలు నిషికాంత్ దుబే (Nishikanth Dube), మనోజ్ తివారీ (Manoj Tiwari)లు కలిసి దేవఘర్‌లోని బైద్యనాథ్ ఆలయానికి (Baidyanath Temple) వెళ్లారు. అంతటితో ఆగకుండా ‘కంచా జల్ పూజ’ జరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు ఉన్నప్పటికీ గర్భగుడిలోకి బలవంతంగా ప్రవేశించి స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ క్రమంలోనే ఎంపీలు మతపరంగా భక్తుల మనోభావాలు దెబ్బ తీశారని, వారి వల్ల ఆలయం బయటకు తొక్కిసలాట జరిగిందని, వారిపై వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఆలయ పూజారి ఠాకూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించిన బైద్యనాథ్ మందిర్ పోలీసులు ఎంపీలు నిషికాంత్ దుబే, మనోజ్ తివారీ, కంషికానాథ్ దుబే, శేషాద్రి దుబే, ఇతరులపై బీఎన్ఎస్ యాక్ట్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Next Story