ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్.. అత్యంత కీలకమైన మరో షాకింగ్ విషయం వెలుగులోకి

by Gantepaka Srikanth |

క్యామ్ కార్డర్ ప్రింట్‌కు ఒక ధర, హెడ్‌డీ ప్రింట్‌కు మరో ధర చెల్లించిన ఐబొమ్మ రవి.

ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్.. అత్యంత కీలకమైన మరో షాకింగ్ విషయం వెలుగులోకి
X

దిశ, వెబ్‌డెస్క్: ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్(ibomma Ravi Custody Report) వెలుగులోకి వచ్చింది. 12 రోజుల కస్టడీలో రవి కీలక అంశాలు రివీల్ చేశారు. సినిమాలను రెండు రకాలుగా కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. క్యామ్ కార్డర్ ప్రింట్‌కు ఒక ధర, హెడ్‌డీ ప్రింట్‌కు మరో ధర చెల్లించినట్లు వెల్లడించారు. ఒక్కో క్యామ్ కార్డర్ ప్రింట్ సినిమాకు రూ.100 డాలర్లు, హెడ్‌డీ ప్రింట్ సినిమాకు రూ.200 డాలర్లు చెల్లించినట్లు తెలిపారు. మొత్తం రవి బ్యాంక్ ఖాతాలకు రూ.13.40 కోట్లు వచ్చినట్లు గుర్తించారు. ఇందులో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా రూ.1.58 కోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ డబ్బులో నుంచి రవి సోదరి చంద్రికకు రూ.90 లక్షల వరకు పంపించారు. లావాదేవీలన్నీ డాలర్ట రూపంలోనే చెల్లించారు. కొంతకాలం కూకట్‌పల్లి నుంచి వ్యవహారం నడిపిన రవి.. డబ్బులు అధికంగా రావడంతో జల్సాల కోసం ఇతర దేశాలకు వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. ఒక్కో కేసులో నాలుగు రోజుల చొప్పున.. మూడు కేసుల్లో 12 రోజులపాటు పోలీసులు ఐబొమ్మ రవిని పోలీసులు విచారించారు.

విచారణ సందర్భంగా రవి మీడియాతో మాట్లాడుతూ.. తన మీద పెట్టిన కేసులన్నీ ఫాల్స్‌ అన్నారు. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటానంటూ తెలిపారు. సరైన సమయంలో వాస్తవాలు బయటపెడతానంటూ కోర్టు ఆవరణలో పేర్కొన్నాడు.

Next Story