అసిఫాబాద్‌లో దారుణం.. పుట్టింట్లో గర్భవతి దారుణ హత్య

by Gantepaka Srikanth |

కొమురంబీం అసిఫాబాద్(Kumuram Bheem Asifabad) జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. పుట్టింట్లో గర్భవతి దారుణ హత్యకు గురైంది.

అసిఫాబాద్‌లో దారుణం.. పుట్టింట్లో గర్భవతి దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: కొమురంబీం అసిఫాబాద్(Kumuram Bheem Asifabad) జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. పుట్టింట్లో గర్భవతి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన అసిఫాబాద్‌లోని దహేగాం మండలం గెర్రె గ్రామంలో చోటుచేసుకుంది. గతేడాది రాణి అనే యువతిని శేఖర్ అనే యువకుడు ప్రేమించి వివాహం(Love Marriage) చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి శేఖర్ తండ్రి సత్తయ్యకు ఇష్టం లేదు. దీంతో తరచూ కోడలు రాణితో గొడవ పడుతుండేవారు. ఇటీవల కూడా గొడవలు మరింత ముదిరాయి. తాజాగా శనివారం కూడా గొడవ జరిగి తీవ్రరూపం దాల్చింది. దీంతో కోడలు రాణిపై కోపంతో రగిలిపోయిన మామ సత్తయ్య పుట్టింట్లో ఉన్న రాణిని కత్తితో నరికి చంపాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు సత్తయ్యను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story