ఉరేసుకొని వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య

by Nallavelli.Anjaneyulu |

ఉరేసుకొని వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని బోర్ల‌మ్ గ్రామంలో చోటు చేసుకుంది.

ఉరేసుకొని వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య
X

దిశ‌, బాన్సువాడ : ఉరేసుకొని వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని బోర్ల‌మ్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బోర్ల‌మ్ గ్రామంలో ఆరెల్లి రాములు(45) ఇంట్లో ఎవ్వ‌రు లేని స‌మ‌యంలో ఉరేసుకున్నాడు. దీంతో ఎవ్వ‌రు లేక‌పోవ‌డంతో మృతి చెందాడు. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని ప‌రిశీలించారు. కుటుంబ స‌మ‌స్యల కార‌ణంగా మృతుడు ఒంట‌రిగా జీవిస్తూ మాన‌సిక ఒత్తిడికి గుర‌య్యాడు. సంఘ‌ట‌న స్థ‌లంలో ఎలాంటి అనుమాన‌స్ప‌ద ప‌రిస్థితులు క‌నిపించ‌లేదు. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు కేసున‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

Next Story