కానిస్టేబుల్ రాసలీలలు.. ఇప్పటికే పెళ్లి అయింది.. కానీ మరో అమ్మాయితో హోటల్ రూంలో..

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ మీరట్‌లో షాకింగ్ విషయం బయటపడింది. మీరట్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ వివేక్ చౌదరిపై ప్రేమించి మోసం చేశాడని, పెళ్లి పేరు చెప్పి శారీరకంగా వాడుకున్నాడని ఆరోపించింది ఓ యువతి. బుర్ఖా ధరించి సీనియర్ సూపరిండెంట్

కానిస్టేబుల్ రాసలీలలు.. ఇప్పటికే పెళ్లి అయింది.. కానీ మరో అమ్మాయితో హోటల్ రూంలో..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ మీరట్‌లో షాకింగ్ విషయం బయటపడింది. మీరట్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ వివేక్ చౌదరిపై ప్రేమించి మోసం చేశాడని, పెళ్లి పేరు చెప్పి శారీరకంగా వాడుకున్నాడని ఆరోపించింది ఓ యువతి. బుర్ఖా ధరించి సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి వెళ్లిన ఆమె.. వివేక్‌పై ఫిర్యాదు చేసింది. 2024లో మొదలైన తమ ప్రేమ కథ.. దాదాపు పద్నాలుగు నెలలుగా సాగిందని.. ఈ కాలంలో చాలా సార్లు హోటల్ రూమ్స్‌లో కలిశామని.. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను సమర్పించింది. ఆ తర్వాత రూమ్‌కు కూడా వెళ్లినట్లు చెప్పింది. కానీ అప్పటికే అతనికి పెళ్లి అయిందన్న విషయాన్ని దాచిపెట్టాడని ఆరోపించింది. విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. తనకు న్యాయం చేయాలని కోరింది. ఇక దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు.. ఇప్పటికే నిందితుడిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

Next Story