అల్వాల్ లో వ్యక్తి దారుణ హత్య..

by Batti.Sumithra |

అల్వాల్ మున్సిపల్ కార్యాలయం వద్ద యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

అల్వాల్ లో వ్యక్తి దారుణ హత్య..
X

దిశ, అల్వాల్ : అల్వాల్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న పాడుబడ్డ బంగ్లాలో ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తిలక్ అనే యువకుడిని నలుగురు వ్యక్తులు దారుణంగా కొట్టి హత్య చేసినట్లు మృతుని బంధువులు, స్థానికులు తెలిపారు. సోనుయాదవ్, లక్ష్మణ్ యాదవ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి హత్యకు పాల్పడినట్లు తెలిపారు. గతంలోనే వీరి పై రౌడీ షీట్ ఉన్నదని తెలిపారు. ఈ హత్యకు కారణం అక్రమ సంబంధమేనని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుకున్న కుటుంబ సభ్యులు బాధితులను గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తిలక్ అనే యువకుడు మృతి చెందగా మరో యువకుడు చికిత్స పొందుతున్నాడు.

Next Story