నడిరోడ్డు మీద గొంతు కోసుకున్న యువకుడు.. ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే షాకవడం ఖాయం..!

by Disha Web |
నడిరోడ్డు మీద గొంతు కోసుకున్న యువకుడు.. ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే షాకవడం ఖాయం..!
X

దిశ, వెబ్ డెస్క్: నడిరోడ్డు మీద ఓ యువకుడు కత్తితో గొంతుకోసుకున్నాడు. అనంతరం నానా భీభత్సం సృష్టించాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని నాథూ చౌక్ ప్రాంతంలో కృష్ణన్ శేర్వాల్ అనే యువకుడు తన గొంతును తానే కోసుకున్నాడు. అనంతరం కత్తితో రోడ్డు మీద అటు ఇటు పరుగెడుతూ నానా భీభత్సం సృష్టించాడు. అతని చేతిలో కత్తిని చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఆ యువకుడి చేతిలో నుంచి కత్తిని లాక్కోవడానికి ప్రయత్నించారు.

ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో సదరు యువకుడు పోలీసులను తీవ్రంగా గాయపరిచాడు. పోలీసుల నుంచి పిస్టల్ లాక్కొని గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు కూడా భయపడ్డారు. కానీ ఎలాగోలా ఆ యువకుడిని పట్టుకున్న పోలీసులు.. పోలీస్ స్టేషన్ కు తరలించారు. 307, 394, 397, 186, 353, 27 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. కాగా భార్య వదిలేసి వెళ్లడంతో కృష్ణన్ శేర్వాల్ డిప్రెషన్ లోకి వెళ్లాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.Next Story