- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బావిలో పడిన ఆవుదూడను కాపాడబోయి వ్యక్తి మృతి..
ఆవు దూడను కాపాడబోయి ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్వక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

X
దిశ, శామీర్ పేట: ఆవుదూడను కాపాడబోయి ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్వక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాల్ గాడి మలక్ పేట్ కు చెందిన నేరేడు శంకర్ (60) ఆవులను మేపడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు ఆవుదూడ బావిలో పడిపోవడంతో దానిని కాపాడేందుకు శంకర్ కూడా అందులోకి దిగడంతో అతను కూడా అందులోనే మునిగిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






