రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. మ‌రో ఐదు మేక‌లు కూడా..!

by Ratna Kumari |

సంక్రాంతి పండుగ‌ పర్వదినం సందర్భంగా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో విషాదం నెలకొంది. 365 జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తితో పాటు మేకలు మృతి చెందాయి.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. మ‌రో ఐదు మేక‌లు కూడా..!
X

దిశ, తుంగతుర్తి : సంక్రాంతి పండుగ‌ పర్వదినం సందర్భంగా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో విషాదం నెలకొంది. 365 జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తితో పాటు మేకలు మృతి చెందాయి. మరికొన్ని మేకలు కూడా ప్రమాదంలో గాయపడ్డాయి. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తగూడెం గ్రామానికి చెందిన కంచం వీరన్న (40) తన వ్యవసాయ క్షేత్రానికి మేకలను తీసుకొని వెళ్తున్నాడు. అదే సమయంలో 365 జాతీయ రహదారి మీదుగా వరంగల్ నుంచి మద్దిరాల మీదుగా కారులో హైదరాబాద్ కి వెళ్తున్న‌ జస్వాల్ నిశాన్ అనే వ్యక్తి అతివేగంగా వస్తూ గ్రామ సమీపంలో ఉన్న టోల్ గేట్ వద్ద వీరన్నతో పాటు మేకలను ఢీకొంటూ సమీపంలో ఉన్న పొలాల్లోకి దూసుకుపోయారు. దీంతో ఐదు మేకలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో మూడు మేకలకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే వీరన్నకు కాలు, చెయ్యి విరగడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమిస్తుండడంతో అక్కడి వైద్యుల సలహా మేరకు హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందారు. మృతునికి భార్యతోపాటు ఇద్దరు సంతానం క‌ల‌రు. స్టేషన్ హౌస్ అధికారి సుధాకర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story