- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్నేహితురాలిపై యాసిడ్ పోసిన అమ్మాయి.. సర్‌ప్రైజ్ అంటూ నమ్మించి..
మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లోని అవధ్‌పూరి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. 21 ఏళ్ల యువతి శ్రద్ధ దాస్‌పై ఆమె స్నేహితురాలు ఇషిత సాహూ (22) యాసిడ్ దాడి చేసింది. ఈ ఘటనలో శ్రద్ధ తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా..

దిశ, వెబ్‌డెస్క్ : మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లోని అవధ్‌పూరి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. 21 ఏళ్ల యువతి శ్రద్ధ దాస్‌పై ఆమె స్నేహితురాలు ఇషిత సాహూ (22) యాసిడ్ దాడి చేసింది. ఈ ఘటనలో శ్రద్ధ తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. దాదాపు 50 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమె తల్లిదండ్రుల జోక్యం ఉందా లేదా అనే కోణంలో విచారిస్తున్నారు. కాగా వారిద్దరు ప్రస్తుతం పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇషిత, శ్రద్ధ ఇంటికి వచ్చి ఆమెను బయటకు రమ్మనగా... శ్రద్ధ మొదట తిరస్కరించింది. కానీ ఇషిత సర్‌ప్రైజ్ ఉందని పట్టుబట్టడంతో శ్రద్ధ బయటకు వచ్చింది. కాసేపు మాట్లాడిన తర్వాత.. శ్రద్ధ ఇంట్లోకి వెళ్లబోతుండగా.. ఇషిత ఆమెపై యాసిడ్ పోసింది. దీంతో బాధితురాలు కేకలు వేయడంతో ఆమె తల్లి బయటకు పరుగెత్తుకుని రాగా.. శ్రద్ధ శరీరం తీవ్రంగా కాలిపోయి, బట్టలు కరిగిపోయిన స్థితిలో కనిపించింది. వెంటనే తనపై నీళ్లుపోసి.. ఆసుపత్రికి తరలించింది.
ఇషిత తల్లి కూడా ఈ దాడిలో పాల్గొన్నట్లు ఆరోపించింది బాథితురాలి తల్లి. శ్రద్ధ, ఇషితలు గతంలో క్లోజ్ ఫ్రెండ్స్. 2013-14లో ఈ కాలనీకి వచ్చినప్పటి నుంచి తెలుసు. కానీ గత ఏడాదిగా వారు మాట్లాడుకోవడం మానేశారు. ఇందుకు కారణం ఇషిత శ్రద్ధపై అసూయతో ఉండటమే అంటోంది శ్రద్ధ తల్లి. శ్రద్ధకు ఉన్న సౌకర్యాలు, లక్ష్యాలు ఇషితకు లేవని.. కానీ అంత పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుందని చెప్పింది. ఇషిత తల్లిదండ్రులు నిరుద్యోగులని, ఈ దాడికి అసూయే కారణమని ఆమె ఆరోపించింది. శ్రద్ధ రెండు నెలల క్రితం ఇషిత నంబర్‌ను బ్లాక్ చేసిందని.. కానీ ఇషిత తల్లి ఈ మధ్య శ్రద్ధకు ఫోన్ చేసి ఇషితతో మాట్లాడమని కోరినట్లు చెప్పింది.






