- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిప్ట్ లో ఇరుక్కొని ఐదేళ్ల బాలిక మృతి
లిప్ట్ లో ఇరుక్కొని ఐదేళ్ల బాలిక మృతి సంఘటన గౌలిదొడ్డిలోని మహీ పీజీ హాస్టల్ లో చోటు చేసుకుంది.

దిశ, శేరిలింగంపల్లి : లిప్ట్ లో ఇరుక్కొని ఐదేళ్ల బాలిక మృతి సంఘటన గౌలిదొడ్డిలోని మహీ పీజీ హాస్టల్ లో చోటు చేసుకుంది. స్థానకులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక లిప్ట్ మొదటి అంతస్తులో ఎక్కి పైకి వెళ్తుండగా ప్రమాదవశాత్తు చిన్నారి గౌన్ లిఫ్ట్ గ్రిల్ లో చిక్కుకుపోయింది. ఐదో అంతస్తుకు వెల్లి.. తిరిగి కిందకి వస్తుండగా.. ఆ బాలిక ఇరుక్కుపోయిన విషయం అక్కడ ఉన్న వారు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.పెట్రోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను లిఫ్ట్ నుంచి కిందకి దించి చూడగా అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. మరణించిన బాలిక బిస్తు ఘోష్ గా తెలిసింది. వీరి స్వస్థలం జార్ఖండ్. గత ఏడేళ్లుగా పీజీ హాస్టల్లో వంట వారిగా పని చేస్తున్న తన తాతయ్య, అమ్మమ్మల దగ్గర ఉంటోంది.తల్లిదండ్రులు లేని ఐదేళ్ల చిన్నారి అమ్మమ్మ తాతయ్యల వద్ద ఉంటుంది. ఆ బాలిక యథావిధిగా లిఫ్ట్ ఎక్కింది. దుస్తులు లిఫ్ట్ గ్రిల్స్‌లో చిక్కుకుపోయి పై అంతస్తు వరకు ఈడ్చికుపోయింది.దీంతో తల వెనుక భాగం తీవ్రంగా ఛిద్రమై, భారీగా రక్తస్రావం అక్కడికక్కడే మరణించింది. చిన్నారి మరణ వార్త అక్కడ ఉన్నవారిని తీవ్రంగా కలిసి వేసింది. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ తెలిపారు.






