స్కూల్‌లో తీవ్ర విషాదం.. ఒకటో తరగతి విద్యార్థి మృతి

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-13 15:13:18  IST  )

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా తిమ్మరాజుపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

స్కూల్‌లో తీవ్ర విషాదం.. ఒకటో తరగతి విద్యార్థి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా తిమ్మరాజుపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్విమ్మింగ్ ఫూల్ పడి ఒకటో తరగతి విద్యార్థి మృతిచెందారు. డావిన్సీ ఇంటర్నేషనల్ స్కూల్‌(DA VINCI International School)లో ఈ ఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. విద్యార్థి మోక్షిత్‌గా గుర్తించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు హుటాహుటిన స్కూల్‌కు పరిగెత్తుకొచ్చారు. యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడ్ని కోల్పోవాల్సి వచ్చిందని స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story