- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫైనాన్స్ వ్యాపారి ప్రాణాలు తీసిన మూలమలుపు
బైరాగులపాడు పెట్రోల్ బంకు సమీపంలోని మూలమలుపు వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చర్ల గ్రామానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి కొవ్వూరి రాజశేఖర్ మృతి చెందారు

దిశ, దుమ్ముగూడెం: మండల పరిధిలోని బైరాగులపాడు పెట్రోల్ బంకు సమీపంలోని మూలమలుపు వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చర్ల గ్రామానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి కొవ్వూరి రాజశేఖర్ మృతి చెందగా, ఆయన భార్య శ్రీలతకు తీవ్ర గాయాలయ్యాయి. చర్ల గ్రామానికి చెందిన ఈ దంపతులు భద్రాచలంలో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరై 10 గంటల సమయంలో తిరిగి తమ గ్రామమైన చర్లకు బయలుదేరారు. ఈ క్రమంలో బైరాగులపాడు సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఉన్న రోడ్డు మూలమలుపులో టీఎస్ 04 ఈ ఏ 8886 నెంబరు గల వీరి కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అతని భార్య శ్రీలతకు తీవ్ర గాయాలు కాగా భద్రాచలంలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రికి తరలించారు. దుమ్ముగూడెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..






