- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దాడికి పాల్పడిన తండ్రీకొడుకుపై కేసు నమోదు
ఓ వ్యక్తిపై తండ్రీకొడుకులు దాడికి పాల్పడడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ వరంగంటి రవి తెలిపారు.

దిశ, జమ్మికుంట : ఓ వ్యక్తిపై తండ్రీకొడుకులు దాడికి పాల్పడడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ వరంగంటి రవి తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఇల్లందకుంట మండల కేంద్రానికి చెందిన కొత్తూరు సురేష్ అనే వ్యక్తి తో జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన కలకోట శంకర్ చిన్నకూతురు తో వివాహం జరిపించేందుకు ఐదు సంవత్సరాల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో వీరి వివాహం వాయిదా పడుతూ వస్తుంది.
అయితే సురేష్ తల్లిదండ్రులు వావిలాల గ్రామానికి వెళ్లి శంకర్ కుటుంబ సభ్యులను వివాహంపై అడగగా, తమ కూతురును మీ కొడుకుకు ఇచ్చేందుకు ఇష్టం లేదని తెలిపారు. ఇదిలా ఉండగా శనివారం సురేష్ వావిలాల గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న శంకర్ తో పాటు అతని కుమారుడు తమ ఊరికి ఏ మొఖం పెట్టుకొని వచ్చావు అంటూ నానా దుర్భాషలాడుతూ కర్రతో దాడి చేశారు. దాంతో సురేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
- Tags
- FIR






