బైకును ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి

by Nallavelli.Anjaneyulu |

బైకును కారు ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది.

బైకును ఢీ కొట్టిన కారు.. ఇద్దరు మృతి
X

దిశ, ఆలేరు : బైకును కారు ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ వికాస్ నగర్ కు చెందిన వట్టి నితిన్ రెడ్డి (28), మహమ్మద్ సీజాహిద్లు ఆలేరు నుంచి జనగామ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. వెనక నుంచి కియా కారు అతివేగంగా అజాగ్రత్తగా ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయి. సంఘటన స్థలంలో మృతి చెందినట్లు SHO యాలాద్రి తెలిపారు. నిందితుడు పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాల‌ను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

Next Story