- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Crime News: ఫోన్ పేలి 8 నెలల చిన్నారి మృతి..
దిశ, వెబ్‌డెస్క్: ఫోన్‌లు పేలుతున్న సంఘటనలు ఫోన్ వినియోగదారులను కలవరపెడుతున్నారు. ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ అదెప్పుడు..

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్‌లు పేలుతున్న సంఘటనలు ఫోన్ వినియోగదారులను కలవరపెడుతున్నారు. ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ అదెప్పుడు పేలుతుందో అర్థంకాక భయపడుతున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి పక్కన చార్జింగ్ పెట్టిన ఫోన్ పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వాటికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు విడిచింది.
తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం.. తమ ఫోన్ లావా కంపెనీకి సంబంధించిందని, ఆరు నెలల క్రితమే తాము ఆ ఫోన్ కొనుగోలు చేశామని తెలిపారు. ఇటీవల ఫ్యాన్ బ్యాటరీ ఉబ్బిపోయిందని వారు చెప్పారు. అంతేకాకుండా ఆ ఫోన్ చార్జర్ సోలార్ ప్యానెల్‌కు కనెక్ట్ చేసుందని, ఘటన జరిగినప్పుడు చిన్నారి తల్లి గదిలో లేదని, పెద్ద శబ్దం రావడంతో తల్లి గదిలోకి పరుగు పెట్టిందని పోలీసులు తెలిపారు. అయితే చిన్నారి తండ్రి ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు.
- Tags
- Crime News Today






