- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్సీ హాస్టల్‌లో గుండెపోటుతో 8వ తరగతి విద్యార్థి మృతి
by Mallepaka Hamsa |
పిడుగురాళ్ల ఎస్సీ హాస్టల్‌లో దారుణ ఘటన జరిగింది. 8వ తరగతి విద్యార్థి మంద కోటిస్వాములుకు గుండెపోటు వచ్చి మృతి చెందాడు.

X
దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఎస్సీ హాస్టల్‌లో దారుణ ఘటన జరిగింది. 8వ తరగతి విద్యార్థి మంద కోటిస్వాములుకు గుండెపోటు వచ్చింది. రాత్రి భోజనం చేశాక ఊపిరాడలం లేదని విద్యార్థి ఫ్రెండ్స్‌కి తెలిపాడు. దీంతో తోటి విద్యార్థులు వార్డెన్‌కు సమాచారం అందించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కోటిస్వాములు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం మృతుడి తల్లిదండ్రులకు తెలియడంతో చదువుకోవడానికి పంపిన కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలిసి వారు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా ఇటీవల కాలంలో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లాభం లేకుండా పోతుంది.
Next Story






