- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిడుగుపాటుకు 48 గొర్రెలు మృతి
by Kema Shiva Kumar |
పిడుగుపాటుకు 48 గొర్రెలు మృతి చెందిన ఘటన భీమ్ గల్ మండలం పల్లికొండ గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

X
దిశ, భీమ్‌గల్: పిడుగుపాటుకు 48 గొర్రెలు మృతి చెందిన ఘటన భీమ్ గల్ మండలం పల్లికొండ గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పల్లికొండ గ్రామానికి చెందిన కుర్మా కరొళ్ల అనిల్ మంగళవారం బాచెన్ పల్లి శివారులో తన గొర్రెలు మేపేందుకు వెళ్లాడు. సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగుపాటుకు కుర్మా కరొళ్ల అనిల్ కు చెందిన 48 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ శ్రీధర్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పూర్తి వివరాలు తెలుసుకుని ఉన్నతాధికారులకు నివేదికను పంపారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.3 లక్షల నష్టం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటనలో గొర్రెల యజమాని కరొళ్ల అనిల్ కు గాయాలు కాగా అతడిని భీమ్ గల్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
Next Story






