డే కేర్ సెంటర్‌లో దారుణం.. 34 మంది చిన్నారులను కాల్చి చంపిన దుండగుడు

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-11 11:56:15  IST  )

థాయ్‌లాండ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

డే కేర్ సెంటర్‌లో దారుణం.. 34 మంది చిన్నారులను కాల్చి చంపిన దుండగుడు
X

దిశ, వెబ్‌డెస్క్: థాయ్‌లాండ్‌(Thailand)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సోంక్లాలోని డే కేర్ సెంటర్‌లో గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డారు. అభం శుభం తెలియని చిన్నారులు అని కూడా చూడకుండా అత్యంత అమానుషంగా కాల్పులు జరిపాడు. అనంతరం తానూ కాల్చుకొని మృతిచెందాడు. ఈ కాల్పుల్లో మొత్తం 23 మంది చిన్నారులు, 11 మంది సిబ్బంది మృతిచెందారు. సమాచారం అందించిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు ఎవరు? ఎందుకింత క్రూరంగా ప్రవర్తిండానే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పిల్లల్ని డే కేర్ సెంటర్‌లో వదిలి వెళ్లిన తల్లిదండ్రులకు విషయం తెలిసి రోదిస్తున్నారు.

Next Story