సినిమా ఛాన్స్ ఇస్తానని.. ప్రాక్టీస్ పేరుతో.. ఏడాదిన్నరగా బాలికపై నిర్మాత అత్యాచారం..

by Sujitha Rachapalli |

గుజరాత్ రాజ్ కోట్‌లో దారుణం చోటు చేసుకుంది. సినిమా ఛాన్స్ పేరుతో 15ఏళ్ల బాలికపై అత్యాచారం చేస్తున్న కేసు వెలుగులోకి వచ్చింది. 25ఏళ్లున్న ఓ వ్యక్తి తనను తాను నిర్మాతగా ప్రకటించుకుని.. సోషల్ మీడియా ప్రకటనతో అమ్మాయి దృష్టిని ఆకర్షించాడు

సినిమా ఛాన్స్ ఇస్తానని.. ప్రాక్టీస్ పేరుతో.. ఏడాదిన్నరగా బాలికపై నిర్మాత అత్యాచారం..
X

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ రాజ్ కోట్‌లో దారుణం చోటు చేసుకుంది. సినిమా ఛాన్స్ పేరుతో 15ఏళ్ల బాలికపై అత్యాచారం చేస్తున్న కేసు వెలుగులోకి వచ్చింది. 25ఏళ్లున్న ఓ వ్యక్తి తనను తాను నిర్మాతగా ప్రకటించుకుని.. సోషల్ మీడియా ప్రకటనతో అమ్మాయి దృష్టిని ఆకర్షించాడు. గుజరాతీ ఫిల్మ్స్‌లో రోల్స్ ఇస్తానని హామీ ఇచ్చాడు.

ముందుగా ఆ అమ్మాయి తల్లితో కలిసి రాజ్ కోట్ లో ఉన్న అతని ఆఫీసుకు వెళ్లి కలిసింది. ఆడిషన్స్, ప్రాక్టీస్ అంటూ ఆమెను పదే పదే రప్పించాడు. రొమాంటిక్ సీన్స్ ప్రాక్టీస్ అంటూ అసభ్యకరంగా తాకడం, ముద్దులు పెట్టడం చేశాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో తల్లికి నచ్చజెప్పాలని సూచించాడు. అనుమతి తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు మత్తు మందు ఇస్తూ.. ఆఫీసు, ఇంట్లో అత్యాచారం చేశాడు. వ్యతిరేకిస్తే ఛాన్స్ ఇవ్వనని బెదిరించాడు. దీంతో చివరకు ఆమె పోలీసులను సంప్రదించడంతో దర్యాప్తు చేసిన పోలీసులు మెడికల్ రిపోర్టులతో సహా అన్ని సాక్ష్యాధారాలను సేకరించారు. పోక్సో కేసు నమోదు చేశారు.

Next Story