దీపావళి వేళ విషాదం.. కార్బైడ్ గన్స్ వల్ల కంటిచూపు కోల్పోయిన 14 మంది

by Ajay Maddhiboyina |

దీపావళి వేళ మధ్య ప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. కార్బైడ్ గన్స్ తో ఆడుకుంటూ 14 మంది చిన్నారులు కంటిచూపు కోల్పోయారు. వందల మంది గాయపడి ఆస్పత్రుల బాట పట్టారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పిల్లలు గాయపడగా విదిష జిల్లాల్లో ఎక్కువమంది గాయపడ్డారు.

దీపావళి వేళ విషాదం.. కార్బైడ్ గన్స్ వల్ల కంటిచూపు కోల్పోయిన 14 మంది
X

దిశ, వెబ్ డెస్క్: దీపావళి వేళ మధ్య ప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. కార్బైడ్ గన్స్ తో ఆడుకుంటూ 14 మంది చిన్నారులు కంటిచూపు కోల్పోయారు. వందల మంది గాయపడి ఆస్పత్రుల బాట పట్టారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పిల్లలు గాయపడగా విదిష జిల్లాల్లో ఎక్కువమంది గాయపడ్డారు. పండుగ జరుపుకున్న మూడు రోజుల్లో భోపాల్, ఇండోర్, జబల్పూర్ మరియు గ్వాలియర్‌లోని ఆసుపత్రులకు బాధితులు క్యూ కట్టారు.

భోపాల్ లోని హమీడియా ఆస్పత్రిలో 72 గంటల్లోనే 26 మంది పిల్లలు చేరినట్టు తెలుస్తోంది. కార్బైడ్ గన్స్ అంటే దేశీయంగా తయారీ చేసిన దేశీ బాణాసంచా తుపాకీ. దీనిని ప్లాస్టిక్ పైపులతో తయారు చేస్తారు. గన్ పౌడర్, అల్గిపుల్ల మందు మరియు కాల్షియం కార్బైడ్ నింపి వీటిని తయారు చేస్తారు. నిజానికి వీటి అమ్మకాలను రాష్ట్రంలో నిషేదించారు. కానీ యథేచ్చగా అమ్మడం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా చాలా మంది కొనుగోలు చేశారు. తక్కవ ధరకే ఎక్కువ శబ్దం చేస్తూ పేలడం వల్ల వీటికి మంచి డిమాండ్ ఉంది. కానీ ఇవి ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Next Story