- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాల్‌పారై ఘాట్ రోడ్డులో పెను విషాదం: 10 మంది టూరిస్టులు దుర్మరణం
తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతం వాల్‌పారైలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతం వాల్‌పారైలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కేరళకు చెందిన పర్యాటకులతో వెళ్తున్న వ్యాన్ నియంత్రణ కోల్పోయి ఘాట్ రోడ్డులో బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు వ్యాన్ శిథిలాల మధ్య ఇరుక్కుపోవడంతో గ్యాస్ కట్టర్ల సాయంతో వాటిని వెలికితీశారు. మృతులంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో కేరళలో విషాద ఛాయలు అలముకున్నాయి. పర్యాటకానికి వెళ్లి శవాలై తిరిగి వస్తుండటంతో బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలపడంతో పాటు, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.






