- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T20WorldCup2026: కీలక మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా
టీ20 ప్రపంచకప్, సెమీ ఫైనల్‌లో భాగంగా నేడు అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్(T20WorldCup2026), సెమీ ఫైనల్‌లో భాగంగా నేడు అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగబోతోంది. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా భారత్ - ఇంగ్లండ్(India vs England) జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేయబోతున్నది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మార్చి 8న జరగనున్న ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఇదిలా ఉంటే.. 2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ జట్టు భారత్‌ను ఓడించింది. అప్పట్లో ఇంగ్లీష్ జట్టు ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఆపై ఫైనల్ గెలిచి ఛాంపియన్ అయింది. ఇప్పుడు ఇండియాకు ఆ లెక్క సరిచేసే అవకాశం వచ్చింది. అయితే, ఇంగ్లాండ్ జట్టు సైతం పటిష్టంగా కనిపిస్తోంది. నేటి రాత్రి జరగనున్న మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది.
భారత జట్టు: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్ జట్టు: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.






