- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగ్లాదేశ్ కు ఎదురుదెబ్బ.. ఐసీసీ డెడ్‌లైన్!
ఈనెల 21వ తేదీ వరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు క్లారిటీ ఇవ్వాలని ఐసీసీ వెల్లడించిందట.

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో ఇండియాలో పర్యటించబోమని బంగ్లాదేశ్ పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. భద్రతా కారణాల వల్ల ఇండియాలో పర్యటించబోమని.. తమ మ్యాచ్ లు శ్రీలంకలో నిర్వహించాలని ఇప్పటికే ఐసీసీని కోరింది బంగ్లాదేశ్. అయితే దీనికి ఐసీసీ అస్సలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీసీసీఐకి సమాచారం కూడా ఇచ్చిందట ఐసీసీ.
బంగ్లాదేశ్ అడిగినట్లు వేదికలు మార్చుకుంటూ వెళ్ళేది లేదని తేల్చి చెప్పిందట. అంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు కూడా ఐసీసీ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇండియాలో పర్యటించే విషయంపై ఈనెల 21వ తేదీ వరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు క్లారిటీ ఇవ్వాలని ఐసీసీ వెల్లడించిందట. ఆ లోపు చెప్పకపోతే టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగినట్లేనని భావిస్తామని హెచ్చరించిందట. అదే జరిగితే బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ఆడుతుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. కాగా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి కొనసాగనుంది.
- Tags
- ICC
- BANGLADESH






