హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. నిన్న ఫిట్ నెస్ క్లియరెన్స్ నేడు గాయంతో అవుట్

by Malleboina Mahesh |

ఫిట్‌నెస్ క్లియరెన్స్ వచ్చిన కొన్ని గంటల్లోనే టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా క్వాడ్రిసెప్స్ స్ట్రెయిన్ కారణంగా అఫ్గానిస్తాన్ వన్డే సిరీస్ నుండి వైదొలిగారు.

హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. నిన్న ఫిట్ నెస్ క్లియరెన్స్ నేడు గాయంతో అవుట్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 అనంతరం జరుగుతున్న మొదటి వన్డే సిరీస్ నేపథ్యంలో భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఊహించని షాక్ తగిలింది. గంటల వ్యవధిలోనే మారిన సీన్ కారణంగా ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్ నుంచి హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. అఫ్గానిస్తాన్‌తో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) నుండి పూర్తి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందిన స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. గంటల వ్యవధిలోనే ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ఆయన 'క్వాడ్రిసెప్స్ స్ట్రెయిన్' (Quadriceps Strain - తొడ కండరాల గాయం) బారిన పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

గంటల వ్యవధిలోనే తీవ్ర నిరాశ..

గాయం తీవ్రత కారణంగా హార్దిక్ పాండ్యా అఫ్గానిస్తాన్ సిరీస్ నుంచి పూర్తిగా వైదొలిగినట్లు సమాచారం అందింది. కేవలం కొన్ని గంటల ముందే ఆయన రోహిత్ శర్మతో కలిసి వన్డే పునరాగమనానికి సిద్ధంగా ఉన్నట్లు స్పోర్ట్స్ సైన్స్ టీమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, ఈ తాజా గాయం టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఒక్కసారిగా ఆందోళనలోకి నెట్టింది. ఆదివారం నుండి ధర్మశాలలో ప్రారంభం కానున్న ఈ వన్డే సిరీస్‌లో హార్దిక్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై సెలక్షన్ కమిటీ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.

Next Story