- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొదటి ODI: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భారత జట్టులోకి రోహిత్, కోహ్లీ
బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు మొదట బౌలింగ్ చేయనుంది.

దిశ, వెబ్ డెస్క్: భారత జట్టు ఇంగ్లాండ్ టూర్ లో భాగంగా ఈ రోజు మొదట వన్డే మ్యాచ్ జరగనుంది. బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు మొదట బౌలింగ్ చేయనుంది. ఈ వన్డే సిరీస్ కు ముందు ఐదు మ్యాచుల టీ20 సిరీస్ వైట్ వాష్ తో ఓడిపోయిన భారత జట్టు.. ఈ వన్డే సిరీస్ పై కన్నేసింది. ఈ క్రమంలో కెప్టెన్ శుభ్ మాన్ గిల్ సారథ్యంలో సీనియర్ ప్లేయర్లు కోహ్లీ, రోహిత్‌ల రాకతో జట్టు మరింత బలంగా మారింది. దీంతో టీ20 సిరీస్ ఘోర వైఫల్యానికి పగ తీర్చుకునేందుకు భారత జట్టు బరిలోకి దిగింది. కాగా నేటి మ్యాచులో గుర్నూర్ బ్రార్ (Gurnoor Brar) భారత తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
భారత్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (సి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (w), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ
ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI: జాకబ్ బెథెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్(సి), జోస్ బట్లర్(w), సామ్ కర్రాన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్






