సైబర్ మోసాలపై గూగుల్ ప్రతినిధులతో సమావేశం

by  |
సైబర్ మోసాలపై గూగుల్ ప్రతినిధులతో సమావేశం
X

దిశ, క్రైమ్‌బ్యూరో: ఆన్‌లైన్ ఫ్లాట్ ఫాం వేదికగా జరుగుతున్న సైబర్ మోసాలపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ గురువారం గూగుల్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సైబర్ మోసాలకు సంబంధించిన పలు అంశాలను వివరించారు. గూగుల్ యాడ్ సర్వీసులను మోసగాళ్ళు ఉపయోగించడం, నకిలీ కస్టమర్ కేర్ నంబర్లను పోస్ట్ చేయడం, యూట్యూబ్‌లో అభ్యంతరకరమైన వీడియోలు, కంటెంట్‌ను తొలగించడం, యూజర్ రిజిస్ట్రేషన్ వివరాలతో పాటు జీమెయిల్, యూట్యూబ్ ఛానెల్‌లలో ఐపి లాగ్‌లు, గూగుల్ పే లావాదేవీలపై మోసాలు జరుగుతున్నట్టు తెలిపారు. సైబర్ నేరాలను నివారించడానికి గూగుల్ సాంకేతిక బృందం తీసుకోవలసిన ముందస్తు చర్యలపై చర్చించారు. గూగుల్ బృందం సానుకూలంగా స్పందించి, దర్యాప్తుకు అవసరమైన సమాచారాన్ని అందించడానికి హామీ ఇచ్చింది. సమావేశంలో గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు, పోలీసులు అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed