రేవంత్ ప్రమాణస్వీకారం.. గాంధీభవన్‌లో ఆ వ్యక్తి ఎవరు.?

by Vadlamudi Anukaran |   (  Updated:2021-07-07 02:46:12  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: రేవంత్ రెడ్డి టీపీసీసీగా మరి కాసేపట్లో పగ్గాలు చేపట్టనుండడంతో గాంధీభవన్ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఉదయం తన నివాసం నుంచి రేవంత్ భారీ ర్యాలీతో గాంధీభవన్‌ వైపు వస్తున్నారు. దీంతో రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హస్తం నేతలు హైదరాబాద్‌కు క్యూ కట్టారు. వేల సంఖ్యలో వచ్చిన నేతలు గాంధీ భవన్ వద్ద గుమిగూడారు. ఇటువంటి సమయంలో ఓ వ్యక్తి మాస్క్‌ పెట్టుకోండి.. మాస్క్ తప్పనిసరి అంటూ కొవిడ్‌పై అవగాహన కార్యక్రమం [&hellip;]</p>

రేవంత్ ప్రమాణస్వీకారం.. గాంధీభవన్‌లో ఆ వ్యక్తి ఎవరు.?
X

దిశ, వెబ్‌డెస్క్: రేవంత్ రెడ్డి టీపీసీసీగా మరి కాసేపట్లో పగ్గాలు చేపట్టనుండడంతో గాంధీభవన్ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఉదయం తన నివాసం నుంచి రేవంత్ భారీ ర్యాలీతో గాంధీభవన్‌ వైపు వస్తున్నారు. దీంతో రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హస్తం నేతలు హైదరాబాద్‌కు క్యూ కట్టారు. వేల సంఖ్యలో వచ్చిన నేతలు గాంధీ భవన్ వద్ద గుమిగూడారు. ఇటువంటి సమయంలో ఓ వ్యక్తి మాస్క్‌ పెట్టుకోండి.. మాస్క్ తప్పనిసరి అంటూ కొవిడ్‌పై అవగాహన కార్యక్రమం చేపట్టడం అక్కడివారిని ఆకర్షించింది. చేతిలో మైక్, ఫేస్ మాస్క్ పెట్టుకోవడమే కాకుండా.. వినూత్న దుస్తులు ధరించి ఆయన గాంధీభవన్‌ ఆవరణలో కరోనా నిబంధనలు పాటించాలని కార్యకర్తలకు గుర్తు చేస్తున్నారు. దీంతో మీడియా కెమెరాలు అతడి వైపు తిరిగాయి. అసలు ఈ వ్యక్తి ఎవరు అంటూ అక్కడికి వచ్చిన కార్యకర్తలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Next Story