ఒలింపిక్స్‌కు కరోనా భయం

by  |
Olympics
X

దిశ, స్పోర్ట్స్: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2020కి మరో మూడు వారాలు మాత్రమే సమయం ఉన్నది. అయితే ఆతిథ్య టోక్యో నగరంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో నిర్వాహకులు భయాందోళనలో ఉన్నారు. జపాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీని ఎత్తి వేసిన తర్వాత టోక్యో సహా పలు నగరాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే టోక్యోలో 714 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు కంటే ఇవి 238 ఎక్కువ. గత నెల రోజుల్లో టోక్యోలో నమోదైన అత్యధిక కేసులు కూడా ఇవే కావడం గమనార్హం. మరోవైపు జపాన్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో 40 శాతం టోక్యోలోనే గుర్తిస్తున్నారు.

ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే విదేశాల నుంచి అథ్లెట్లు, ఇతర సిబ్బంది భారీగా టోక్యో చేరుకోనున్నారు. ఇక అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అని అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇక జపాన్ ప్రభుత్వం మాత్రం మెగా ఈవెంట్ కోసం భారీగా డాక్టర్లు, వైద్య సిబ్బందిని సిద్దంగా ఉంచింది. ఒలింపిక్స్ వల్ల కొత్త వేరియంట్ పుట్టుకొచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండటంతో కరోనా ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని నిర్వాహక కమిటీ ఆదేశించింది. స్టేడియంలు, క్రీడా గ్రామంలో తప్పని సరిగా అందరూ ప్లే బుక్‌లోని నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది.


Next Story

Most Viewed