జంటహత్య కేసుల కలకలం.. వెలుగులోకి సంచలన నిజాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-09-24 23:57:02  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని వెలుగోడు సీపీనగర్‌లో జంట హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. చిన్ని, ఓబులేసులను దుండగులు అతి కిరాతకంగా నరికి చంపారు.  వివరాల్లోకి వెళ్లితే.. మల్లికార్జునకు ఇద్దరు భార్యలు. అయితే వీరు వెలుగోడులో నివాసం ఉంటున్నారు. వీరితో పాటు ఓబులేసు కూడా వారింటిలో పనిచేస్తూ వారితోనే ఉంటున్నాడు. వీరి మధ్య ఏం గొడవలు ఉన్నాయో తెలియదు కానీ, శుక్రవారం రాత్రి ఓబులేసు, మల్లికార్జున  రెండవ భార్య చిన్నిని కిరాతకంగా [&hellip;]</p>

Murder
X

దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని వెలుగోడు సీపీనగర్‌లో జంట హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. చిన్ని, ఓబులేసులను దుండగులు అతి కిరాతకంగా నరికి చంపారు. వివరాల్లోకి వెళ్లితే.. మల్లికార్జునకు ఇద్దరు భార్యలు. అయితే వీరు వెలుగోడులో నివాసం ఉంటున్నారు. వీరితో పాటు ఓబులేసు కూడా వారింటిలో పనిచేస్తూ వారితోనే ఉంటున్నాడు. వీరి మధ్య ఏం గొడవలు ఉన్నాయో తెలియదు కానీ, శుక్రవారం రాత్రి ఓబులేసు, మల్లికార్జున రెండవ భార్య చిన్నిని కిరాతకంగా నరికి చంపారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే మల్లికార్జున తండ్రి ఈ హత్యలు చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరి హత్యలకు అక్రమ సంబంధం కారణం అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Next Story